ఎన్టీఆర్ నెక్ట్స్ టార్గెట్ చిరంజీవే.. కొడ‌తాడా..?

అర‌వింద స‌మేత ఉప్పెన‌లా మొద‌లైనా కూడా ఇప్పుడు త‌గ్గిపోయింది. అస‌లు చాలా స్మూత్ గా సాగుతుంది జ‌ర్నీ. మొదట్లో క‌నిపించిన సంచ‌ల‌నం ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. మొద‌ట్లో ఈ చిత్ర జోరు చూసి ఈజీగా 100 కోట్ల మార్క్ అందుకుంటుంది అనుకున్నారు కానీ ఐదు రోజుల త‌ర్వాత వీర‌రాఘ‌వ చ‌ల్ల‌బ‌డ్డాడు. ఈ చిత్ర వ‌సూళ్లు స‌డ‌న్ గా ప‌డిపోయాయి. తొలివారం ఈ చిత్రం 75 కోట్ల మార్క్ అందుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 93 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఓవ‌రాల్ గా సేఫ్ జోన్ కు వ‌చ్చింది కానీ ఇంకా కొన్ని ఏరియాల్లో మాత్రం న‌ష్టాల్లోనే ఉంది అర‌వింద స‌మేత‌. ఇక ఈ చిత్రం ఇప్పుడు ఖైదీ నెం.150 వ‌సూళ్ల‌ను దాటేస్తుందా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.
ఖైదీ నెం.150 ఫుల్ ర‌న్ లో 164 కోట్లు వ‌సూలు చేసింది. ఇప్పుడు అర‌వింద స‌మేత ఖాతాలో 158 కోట్ల గ్రాస్ ఉంది. ఈ వీకెండ్ అయిపోయేస‌రికి చిరు రికార్డులు ఎన్టీఆర్ దాటేస్తాడ‌ని అనుకుంటున్నారు. అది జ‌రిగినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. అయితే షేర్ లో మాత్రం ఖైదీ నెం.150 పేరు మీదున్న 104 కోట్ల రికార్డును అందుకోవ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తుంది. ఇప్పుడు మూడో వారం కూడా చెప్పుకోద‌గ్గ వ‌సూళ్ళు తీసుకొస్తేనే అర‌వింద స‌మేత సేఫ్ అవుతుంది. లేదంటే ఈ సినిమాను హిట్ అనలేం.
నైజాంతో పాటు మ‌రో రెండు మూడు ఏరియాలు త‌ప్ప ఇప్ప‌టికీ చాలా ఏరియాల్లో అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ బ్రేక్ ఈవెన్ కాలేదు. ఓవ‌ర్సీస్ లో మాత్రం ఈ ఫ్యాక్ష‌న్ డ్రామా ఫ్లాప్ అని తేలిపోయింది. అక్క‌డ 2 మిలియ‌న్ దాటేసింది కూడా సేఫ్ కావాలంటే 3 మిలియ‌న్ రావాలి. ఈ లెక్క‌న అర‌వింద స‌మేత ఓవ‌ర్సీస్ లో లాస్ వెంచ‌ర్ గా మిగిలిపోవ‌డం ఖాయం. మొత్తానికి మ‌రో వారం రోజులు ఆగితే సినిమా ఎక్క‌డెక్క‌డా ఎంత తెచ్చింది.. ఎంత పోయింది అనేదానిపై పూర్తి క్లారిటీ వ‌చ్చేస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు ఈ స‌స్పెన్స్ త‌ప్ప‌దు.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange