కాంట్రాక్ట‌ర్ భార్య‌కు ముస‌లి మంత్రి ఫోన్‌…డార్లింగ్ ఎప్ప‌డొస్తావ్‌

ఓటుకు నోటు పుణ్య‌మాని ఫోన్ ట్యాపింగ్ వివాదం రెండు రాష్ట్రాల్లోనూ ముదురుతోంది. ఈ విష‌యాన్ని మ‌రువ‌క ముందే ఓ హిమాచ‌ల్ మంత్రి త‌న రాస‌లీల సంభాష‌ణ‌లు బ‌య‌ట‌కు పొక్క‌డంతో ఉక్కిరిబిక్కిర‌వుతున్నాడు. ఈ ఆడియో టేప్‌ను విడుద‌ల చేసిన సంబంధిత వ్య‌క్తులెవ‌ర‌ని వాక‌బు చేస్తూ.. కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు.

ప్ర‌స్తుతం హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను కుదిపేస్తున్న ఈ సంఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఓ కాంట్రాక్టర్ భార్యకు ఫోన్ చేసి.. డార్లింగ్.. తనకు కొంత సమయం కేటాయించు..ఎప్పుడొస్తావ్ అని అడిగేశాడు. అయితే ఈ సంభాషణలతో కూడిన ఆడియోను తాజాగా అజ్ఞాత వ్యక్తి లీక్ చేశారు. దీంతో మంత్రి వివాదాల్లో చిక్కుకున్నారు.

వ‌య‌స్సు మ‌ళ్లిన ఈ మంత్రి ఉదంతంపై ఇప్పుడిక్క‌డ దుమారం రేగుతోంది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ భగ్గుమంటోంది. అధికార కాంగ్రెస్‌లో త‌లెత్తిన విభేదాలు నుంచి ప్రజలనూ, పార్టీలనూ, మీడియానూ దృష్టిమళ్లించేందుకే ఈ ఆడియో టేప్‌ను కాంగ్రెస్ నేతలు లీక్ చేశారంటూ విమర్శలు గుప్పిస్తోంది.

మరోవైపు ఈ ఆడియో టేపులపై మంత్రి ఠాగూర్ స్పందించారు. ఇవి నకిలీవని, ఇదంతా రాజకీయకుట్రలో భాగంగానే జరిగింద‌న్నారు. అందుకే వీటిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని డీజీపీని కోరినట్టు మంత్రి సెలవిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు అధికారంలో ఉండగా పెద్దఎత్తున ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారన్న‌ది ఆయ‌న ఆరోప‌ణ‌.
.

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange