చిన్ననాటి బసవ తారకం కి కథానాయికగా అవకాశాల వెల్లువ..

లవ్ యు బంగారం చిత్రం లో హీరోయిన్ గా నటించి మెప్పించిన శ్రావ్య చెల్లెలు గ్రీష్మ కి ఇప్పుడు టాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. వందేమాతరం శ్రీనివాస్ నటించిన అమ్ములు అనే చిత్రం లో బాలనటిగా నటించింది. రీసెంట్ గా మహానాయకుడు లో యుక్త వయస్సు బసవ తారకం గా నటించి నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, నిర్మాత వారాహి సాయి ప్రశంసలు పొందింది… అంతే కాకుండా తెలుగు సినిమా ప్రేక్షకుల అభిమానం పొందిన గ్రీష్మ కి వరుసగా ఆఫర్స్ రావడం విశేషం. ఛాలెంజింగ్ రోల్స్ చేయడం అంటే తనకు చాలా ఇష్టమని…. ఏ తరహా పాత్ర ఇచ్చినా చేసేందుకు రెడీగా ఉన్నానని చెప్పింది. అన్ని రకాల పాత్రలు చేస్తూ…. తెలుగు సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటోంది….గ్రీష్మ.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange