గుఢాచారి ప్రివ్యూ.. త‌క్కువ అంచ‌నా వేయొద్దు..!

ఎప్పుడు ఏ సినిమా ప్రేక్ష‌కులను మెప్పిస్తుందో చెప్ప‌డం క‌ష్టం. చిన్న సినిమా క‌దా అని లైట్ తీసుకుంటే.. అదే హెవీగా క‌లెక్ష‌న్లు తీసుకొచ్చే ఛాన్స్ లేక‌పోలేదు. ఇలా జ‌రిగింది కూడా చాలాసార్లు. ఈ మ‌ధ్యే ఆర్ఎక్స్ 100 విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఇక ఇప్పుడు గూఢాచారి కూడా ఇలాగే వ‌స్తుంది. అడవిశేష్ న‌టించిన ఈ చిత్రాన్ని శ‌శికిర‌ణ్ టిక్కా తెర‌కెక్కించాడు. ఆగ‌స్ట్ 3న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఆగ‌స్ట్ 2 రాత్రే యుఎస్ లో 300 కి పైగా ప్రీమియ‌ర్స్ వేస్తున్నారు. అడ‌విశేష్ లాంటి హీరోకు ఇది చాలా అంటే చాలా ఎక్కువ‌. కానీ సినిమాపై న‌మ్మ‌కంతో అక్క‌డ అన్ని ప్రీమియ‌ర్స్ వేస్తున్నారు.
క్ష‌ణం త‌ర్వాత శేష్ క‌థ రాయ‌డం ఇది మ‌రోసారి. రెండేళ్ల కింద వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ అయింది. హిందీలోనూ భాగీ 2గా రీమేక్ అయి అక్క‌డా బంప‌ర్ హిట్ కొట్టింది ఈ చిత్రం. ఇక ఈ చిత్రం వ‌చ్చిన రెండేళ్ల త‌ర్వాత ఇప్పుడు గూడాచారిగా వ‌స్తున్నాడు. ఇన్నాళ్లూ ఈ చిత్రం గురించి త‌క్కువ అంచ‌నా వేసుకున్న వాళ్లంతా ఇప్పుడు విజువ‌ల్స్ చూసి మెంట‌ల్ ఎక్కిపోతున్నారు. టీజ‌ర్ తోనే పిచ్చెక్కించిన శేష్.. ట్రైల‌ర్ తో అదుర్స్ అనిపించాడు.
భారీ క్యాస్టింగ్ కు తోడు అద్భుత‌మైన విజువ‌ల్స్ తో పిచ్చెక్కించాడు శేష్. ఈ సినిమాకు మ‌రో విశేషం కూడా ఉంది. గూడాఛారితోనే అక్కినేని వార‌మ్మాయి సుప్రియ రీ ఎంట్రీ ఇస్తుంది. అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి త‌ర్వాత స్క్రీన్ కు దూర‌మైన సుప్రియ‌.. 20 ఏళ్ల‌ త‌ర్వాత మ‌ళ్లీ న‌టిస్తుంది. అభిషేక్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో హిట్ కొట్టి క‌చ్చితంగా తెలుగులో తాను కూడా క్రేజీ హీరో అనిపించుకోడానికి ట్రై చేస్తున్నాడు అడ‌విశేష్.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange