గాలిపురం జంక్షన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

రవి కమల్ సమర్పణ లో అభిషేక్ ఆర్ట్స్ మరియు దృవ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ” గాలిపురం జంక్షన్ ” చిత్రం యొక్క ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమం నిన్న అనగా 14 వ తేదీ సాయంత్రం ఫిలిం చాంబర్ లో “మా” నూతన అధ్యక్షుడు శ్రీ నరేష్ గారు , నిర్మాత- సంతోషం పత్రిక అదినేత సురేష్ కొండేటి గారు మరియు నిర్మాత – లయన్ సాయివెంకట్ గారి ఆద్వర్యంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా నటుడు మా నూతన అధ్యక్షుడు అయిన నరేష్ గారు మాట్లాడుతూ రవి కమల్ సమర్పణలో చరణ్ బాలాజి నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం గాలిపురం జంక్షన్ చిత్రం ట్రైలర్ చూసాను చాలా బాగుంది దర్శకుడు చరణ్ బాలాజి దర్శకత్వం చాలా బాగుంది యాక్షన్ ఒక్కటే కాకుండా లవ్ అలాగే ఎమోషన్ అలాగే రైతుల సమస్యలను కూడా ప్రస్తావించారు చాలా బాగుంది అలాగే హీరో అభిషేక్ నటన చాలా బాగుంది చాలా ఈజ్ ఉంది అలాగే హీరోయిన్ మదు కూడా చాలా అందంగా ఉంది ఇంకొక హీరో బాలాజీ కూడా చాలా బాగా నటించారు ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి ఇన్ని ఎమోషన్స్ సమపాళ్ళలో ఉన్న ఈ చిత్రం మంచి విజయం సాదించాలి అని కోరుకుంటున్నాను అలాగే ఇంకొక అతిది సురేష్ కొండేటి మాట్లాడుతూ రవి కమల్ నాకు తను దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నప్పటి నుండి నాకు బాగా తెలుసు తను ఈ గాలిపురం జంక్షన్ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది ఇందాక మా మా అధ్యక్షుడు చెప్పినవిదంగా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ సమపాళ్ళలో ఉన్నాయి అలాగే డ్రమ్స్ రాము స్వరపరచిన పాటలు బాగున్నాయి ఇంకా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది నగేష్ వర్మ పనితనం బాగుంది అలాగే చరణ్ బాలాజీ దర్శకత్వం కమర్షియల్ గా చాలా బాగుంది బాలాజీ ఇంతకుముందు చాలా సినిమాలు దర్శకత్వం వహిమచాడు అందులో ఒక రాదా ముగ్గురు కృష్ణులు సినిమా ఫంక్షన్ కి కూడా నేను అతిదిగా వచ్చాను ఈ సినిమాతో బాలాజీ దర్శకుడిగా మంచి పేరు సంపాదిస్తాడు అని ఈ ట్రైలర్ చూస్తే అర్దం అవుతుంది all the best , అలాగే మరో నిర్మాత లయన్ సాయి వెంకట్ గారు మాట్లాడుతూ బాలాజీ ఎప్పటి నుంచో నాకు బాగా తెలుసు ఇప్పటికీ ఓ పది సినిమాల వరకు దర్శకత్వం వహించాడు అన్ని సినిమాలు విడుదల చేసాడు కాని ఈ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు సంపాదిస్తాడు అని నాకు ఈ ట్రైలర్ చూస్తే నాకు అర్థం అవుతుంది తను ఎప్పుడూ ఏ సహాయం కావాలి అన్న నా దగ్గరకు వస్తాడు నేను కాదనకుండా చేస్తాను ఈ సినిమాకి రవి కమల్ సమర్పకుడిగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు , మిగిలిన వివరాలు సమర్పణ – రవి కమల్ , నిర్మాత దర్శకత్వం- చరణ్ బాలాజీ, నటీ నటులు – అభిషేక్, బాలాజీ , మదుశ్రీ , కవిత, శేఖర్ , శ్రీనివాస్ నాయుడు, బేబి పావని , అనూషా, సౌజన్య కెమెరా-నగేష్ వర్మ , ఎడిటింగ్ – సెల్వ కుమార్ , ఫైట్స్ – దేవరాజ్ , మాటలు – బాలాజీ, శ్రీదర్ , నిర్మాత దర్శకత్వం చరణ్ బాలాజీ

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange