శరవేగంగా ‘ఎర్రచీర’ షూటింగ్‌.. రెండో షెడ్యూల్‌ పూర్తి

erracheera

బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ఎర్రచీర’. సీహెచ్‌ సుమన్‌ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అనుకున్న రీతిలో ఈ నెల 25న రెండో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు సుమన్‌ బాబు మాట్లాడుతూ.. సిటీ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన రెండో షెడ్యూల్‌లో భాగంగా శ్రీరాంపై చిత్రీకరించిన యాక్షన్‌ సన్నివేశాలు, అజయ్‌ మహేష్‌పై తీసిన ఛేజింగ్‌ సీన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌కు మించి సంతృప్తినిచ్చిందన్నారు. అలాగే సీనియర్‌ హాస్యనటుడు అలీతో తీసిన హారర్‌, కామెడీ సన్నివేశాలు కూడా చక్కగా వచ్చాయని, ఈ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా మెప్పిస్తాయని చెప్పారు.
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ తోట సతీష్‌ మాట్లాడుతూ.. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను రూపొందిస్తున్నామన్నారు. ఆగస్టు చివరి వారంలో గానీ, సెప్టెంబర్‌ మొదటి వారంలో గానీ రిలీజ్‌ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నామని చెప్పారు

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial
Secured By miniOrange