ఈ ద‌ర్శ‌కుల‌ పరిస్థితి ఏంటి….

 

ఒక‌ప్పుడు రాజాల్లా బ‌తికిన వాళ్లు ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌క తిక్క‌చూపులు చూస్తున్నారు. అప్ప‌ట్లో వాళ్లు ఒక్క అవ‌కాశం ఇస్తే స్టార్ హీరోలు కూడా పండ‌గ చేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్లెక్క‌డ క‌నిపిస్తే అవ‌కాశం అడుగుతారో అని త‌ప్పుకుని తిరుగుతున్నారు. ఇదే మ‌రి ఇండ‌స్ట్రీ అంటే. ఇక్క‌డ హిట్ ఉన్న‌పుడు ఒక‌లా.. లేక‌పోతే మ‌రోలా ఉంటుంది ప‌రిస్థితి. దానికి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం వినాయ‌క్.. పూరీ జ‌గ‌న్నాథ్. టాలీవుడ్ గ‌తిని మార్చేసిన ద‌ర్శ‌కుల్లో ఈ ఇద్ద‌రూ ఉంటారు.

గ‌త 15 ఏళ్లుగా టాప్ 3లో ఉండే ద‌ర్శ‌కులు వీళ్లు. రాజ‌మౌళి త‌ర్వాత అంతగా మాస్ సినిమాలు చేస్తాడ‌ని పేరుంది వినాయ‌క్ కు. ఇక ఒక్క సినిమాతో హీరో ఇమేజ్ ను మార్చేస్తాడ‌నే పేరున్న ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్. కానీ ఇద్ద‌రూ ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. దానికి కార‌ణం కొన్నేళ్లుగా వ‌ర‌స ఫ్లాపులు. వినాయ‌క్ కు ఖైదీ నెం.150 హిట్టైనా కూడా ఆ క్రెడిట్ రాలేదు. దాన్ని నిజం చేస్తూ ఇంటిలిజెంట్ ఫ్లాప్ అయిన తీరు ఈయ‌న్ని హీరోల‌కు దూరం చేసింది.

ఇక పూరీ కూడా టెంప‌ర్ త‌ర్వాత మ‌రో హిట్ కొట్ట‌లేక‌పోయాడు. దాంతో ఈ ఇద్ద‌ర్నీ చూస్తుంటేనే హీరోలు మొహం తిప్పుకుంటున్నారిప్పుడు. బాల‌య్య‌తో వినాయక్ సినిమా క‌న్ఫ‌ర్మ్ అయినా కూడా ఎన్టీఆర్ కార‌ణంగా అది హోల్డ్ లో ప‌డిపోయింది. మొత్తానికి ఒక‌ప్పుడు ఎన్టీఆర్.. చ‌ర‌ణ్.. బ‌న్నీ లాంటి వాళ్ల‌ను స్టార్స్ గా మార్చేసిన ఈ ద‌ర్శ‌కులు ఇప్పుడు ఖాళీగా ఉండ‌టం వాళ్ల అభిమానుల‌కు కూడా న‌చ్చ‌డం లేదు.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange