దిల్ రాజు, అల్లు అర‌వింద్ పై పేట నిర్మాత ఫైర్..

సంక్రాంతికి ఒకేసారి నాలుగు సినిమాలు రావడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఒకేసారి ఇన్ని సినిమాలు రావడం పెద్ద విషయం కాదు కానీ థియేటర్ల సమస్య ఇప్పుడు అందరిని వెంటాడుతుంది. ఇన్ని రోజులు ఈ విషయంపై మాట్లాడటానికి ఏ నిర్మాత ధైర్యం చేయలేదు. అయితే ఇప్పుడు పేట ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత అశోక్ వల్లభనేని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీలో దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి నిర్మాతలు త‌మ‌ చేతిలోనే థియేటర్లు అన్నీ ఉంచుకుని ఆడుకుంటున్నారంటున్నాడు. వాళ్ల సినిమాలే ఆడాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించాడు ఈయ‌న‌. మంచి సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా వాళ్లు అడ్డుకుంటున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు ఈయన.
ఈ నిర్మాత‌ మాటలకు ఇండస్ట్రీలో ఉన్న కొందరు పెద్దలు కూడా సపోర్ట్ చేస్తుండటంతో వివాదం ఇంకా పెరిగి పెద్దదవుతుంది. సంక్రాంతికి విడుదలవుతున్న నాలుగు సినిమాల్లో పేట సినిమాకు చాలా తక్కువ స్క్రీన్స్ వచ్చాయి. కొన్ని ఏరియాల్లో అయితే డిస్ట్రిబ్యూటర్లు రాక సొంతంగా విడుదల చేసుకుంటున్నాడు అశోక్ వల్లభనేని. ఇన్ని కోట్లు పెట్టి సినిమా విడుదల చేస్తున్నప్పుడు థియేటర్స్ లేకపోతే ఏం చేసుకోవాలి.. ఎక్కడికి వెళ్లి మేము న్యాయం అడగాలి అంటున్నాడు ఈ నిర్మాత. దీనిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్ర‌బాబు నాయుడు కూడా ఒక ప్రకటన చేయాలని.. థియేటర్లు ఏ ఒక్కరి సొత్తు కాదు గుర్తించాలంటూ కోరుతున్నాడు అశోక్ వల్లభనేని.
మంచి సినిమాలు తీసినా థియేట‌ర్లు లేక అవి పోతున్నాయంటున్నాడు ఈ నిర్మాత‌. వాళ్ల సినిమాలు మాత్రమే థియేటర్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అంటూ చేసిన సెన్సేష‌న‌ల్ కమెంట్స్ చేసాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈయ‌న క‌మెంట్స్ వైరల్ గా మారిపోతున్నాయి. ఒకప్పుడు దాసరి ఉన్నప్పుడు చిన్న సినిమాల కోసం యుద్ధం చేసేవాడు. ఆయన పోయిన తరువాత థియేటర్ల మాఫియాపై ఎవరూ మాట్లాడలేదు. ఇన్నాళ్లకు అశోక్ మళ్లీ గళం విప్పాడు. ఇది ఎక్కడ ముగుస్తుందనేది చూడాలిక‌.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange