దేవదాస్ నాటకాలకు చెక్….

టాలీవుడ్ లో ఇప్పుడు ఓ విచిత్రమైన ఫైట్ జరుగుతోంది. నాగార్జున, నాని లాంటి స్టార్స్ తో పాటు రష్మిక, ఆకాంక్ష లాంటి గ్లామర్ డాల్స్ ఎట్రాక్షన్ ఉన్న సినిమా దేవదాస్. ఈసినిమా ఈనెల 27న రిలీజ్ అవుతోంది. సోలో రీలీజ్ తో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టాలనే ప్లాన్ చేశారు. అయితే వీరి నాటకాలకు చెక్ పెట్టిందో చిన్న సినిమా. అదే నాటకం…

అంతా కొత్త వారు నటించిన ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయిన రోజు సూపర్ బజ్ వచ్చింది. నాటు కంటెంట్… ఘాటు రొమాన్స్ తో ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. చిన్న సినిమా టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ అవుతుందనేది ఇండస్ట్రీలో మారు మోగింది. నాగార్జున, నాని లాంటి స్టార్స్ ఉన్న దేవదాస్ కు లేని బజ్ నాటకం సంపాదించుకుంది. రా కంటెంట్ కావడం.. దేవదాస్ ట్రైలర్ జనాల్లోకి వెళ్లకపోవడం… బజ్ లేకపోవడంతో నాటకం సినిమాపై అందరి దృష్టి పడింది.

నాటకం కంటే ఒకరోజు ముందుగా దేవదాస్ రిలీజ్ కావడం మాత్రమే కలిసొచ్చే అంశం. ఆ మరుసటి రోజే నాటకం రిలీజ్ అవుతోంది. నిజంగా దేవదాస్ కి నాటకం పెద్ద చెక్ పెట్టేలాగే కనిపిస్తోంది. దేవదాస్ ని నాటకం సినిమా నిజంగానే దెబ్బ కొడితే మాత్రం నాగార్జున, నానికి పెద్ద అవమానమే…..

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange