దేవదాస్ మూవీ రివ్యూ

మల్టీస్టారర్ చిత్రాలు మనకు చాలా తక్కువ. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలకు తగ్గ కథలు సరిగ్గా రాయట్లేదనేది హీరోల కంప్లైంట్. అయితే అడపాదడపా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. ఆ తరం హీరో నాగార్జున, ఈ తరం ఫాంలో ఉన్న నాని కలిసి చేసిన సినిమా దేవదాస్. ఇద్దరు పెద్ద స్టార్స్ ని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డీల్ చేయగలిగాడా ఎలాంటి ప్రొడక్ట్ డెలివర్ చేశాడో చూద్దాం.

ఈ సినిమా కథ చాలా సింపుల్. పెద్దగా కథ బలంగా లేదు కాబట్టి సింపుల్ గా చెప్పొచ్చు. దేవ మాఫియా డాన్. దాస్ డాక్టర్. పోలీసులు దింపిన బుల్లెట్ తీయించుకునేందుకు దాస్ క్లినిక్ కు వెళ్తాడు. అలా ఇద్దరూ స్నేహితులౌతారు. ఓ డాన్ ఓ డాక్టర్ స్నేహితులైతే ఎలా ఉంటుంది అనేదే కథ. ప్రాణాలు తీసే డాన్ ను, ప్రాణాలు పోసే డాక్టర్ మార్చాడా లేదా అన్నదే కథ. ఈ కథ ఎక్కడో విన్నట్టే ఉంది కదా. ఉంటుంది.
సరే కథ సింపుల్ గా ఉన్నా డీల్ చేసే విధానం బట్టి సినిమా ఫలితం మారుతుంది. కథ వీక్ గాఉన్నట్టే నరేషన్ కూడా బాగా వీక్ గా ఉంది. సింపుల్ సీన్స్ తో లాగించేశాడు దర్శకుడు. ఓసీన్ నాగార్జునకు, ఓ సీన్ నానికి సరిసమానంగా పంచి ఇచ్చాడు. దీన్నిబట్టే ఇద్దరినీ కవర్ చేసేందుకు ఎంతగా ఇబ్బంది పడ్డాడో అర్థమైంది. కంటెంట్ వీక్ గా ఉన్నప్పటికీ ఇద్దరు హీరోలు మోసేందుకు చాలా ట్రై చేశారు కానీ వారి పడిన శ్రమ వృధా అయినట్టు కనిపిస్తుంది. ఆశించిన ట్విస్టులు లేవు. ఆశించిన కామెడీ లేదు. ఆశించిన ఎమోషన్ లేదు. కనీసం హీరోయిన్స్ అయినా కాపాడతారేమో అనుకుంటే అది లేదు. ఇద్దరికీ ఇంపార్టెన్స్ లేని పాత్రలు. ఇద్దరు పెద్ద హీరోలు ఉండే సరికి హీరోయిన్లకు కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు దక్కలేదు. రష్మిక లాంటి పెర్ ఫార్మర్ ఉన్నప్పటికీ డైరెక్టర్ పెద్దగా ఉపయోగించుకోలేదు.

అన్నట్టు ఈ సినిమాలో చాలా మంచి తెలిసిన వాళ్లే ఉన్నారు. నవీన్ చంద్ర, బాలీవుడ్ హీరో కునాల్ కపూర్, అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ, రావ్ రమేష్. ఇంతమంది ఉన్నప్పటికీ ఎవ్వరికీ పెద్గగా పనిలేకుండా పోయింది. అడపాదడపా అలా వచ్చి ఇలా వెళ్లారు. టెక్నికల్ గానూ మణి శర్మ పెద్దగా గొప్ప పాటలేం ఇవ్వలేదు. కెమెరా వర్క్ బాగుంది. ఒకట్రెండు కామెడీ సీన్స్, ఒకట్రెండు ఎమోషనల్ సీన్స్ తప్ప చెప్పుకోతగ్గ సీన్స్ రాసుకోలేకపోయారు. ఆశించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం… వీక్ స్క్రీన్ ప్లే శ్రీరామ్ఆదిత్య నుంచి ఆశించం. కానీ శ్రీరామ్ అనుకున్న రేంజ్ కథ, కథనం అందించలేదు.

భారీ అంచనాలతో వెళ్లిన ప్రేక్షకులకు మాత్రం తీవ్ర నిరాశ తప్పదు. నాని, నాగార్జున ఫ్యాన్స్ ఈ సినిమాను కాపాడాలి. లేకపోతే… రెగ్యులర్ గా ఈ హీరోలకు వచ్చే కలెక్షన్స్ కూడా రావడం కష్టమే.

PB Rating : 2/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange