చిరు చెయ్యేశాడు…. దేశంలో దొంగలు పడ్డారు ట్రైలర్ హంగామా…

మెగాస్టార్ చిరంజీవి… స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు…. ఆయన సినిమా చేసినా… సంచలనమే… ఆయన ఓ సినిమాకు ప్రమోషన్ చేసినా సంచలనమే. మెగాస్టార్ ఓ సినిమా గురించి మాట్లాడితే చాలు ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ అవుతుందో మరోసారి ప్రూవ్ అయ్యింది. దేశంలో దొంగలు పడ్డారు అనే చిత్ర ట్రైలర్ ఆయన చేతుల మీదుగా విడుదలైంది. చిత్ర ట్రైలర్ చూసిన తర్వాత ఆయన చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఆయన రిలీజ్ చేసిన ట్రైలర్స్ లో సంచలనం సృష్టించిన ట్రైలర్ ఇదే.

ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ ఆలీ తమ్ముడు ఖయ్యుమ్ హీరోగా నటించాడు. గౌతమ్ అనే కొత్త కుర్రాడు దర్శకుడు. ఆలీ ఈ చిత్రాన్ని చూసిన తర్వాత నచ్చడంలో సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆలీ చొరవతో ఈసినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆలీ సపోర్ట్ తో చిరంజీవి చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఆయన రిలీజ్ చేసిన తర్వాత ట్రేడ్ సర్కిల్స్ లో బాగా డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఔట్ రైట్ గా అమ్మేశారని తెలిసింది. ల్యాబ్ రిపోర్ట్ పాజిటివ్ గా ఉండడంతో అన్ని ఏరియాల నుంచి స్పందన బాగా వచ్చింది. అందునా చిరంజీవి ట్రైలర్ రిలీజ్ చేయడంతో కామన్ మ్యాన్ కు బాగా రిచ్ అయ్యింది. ఓవరాల్ గా చిరు స్టామినా ఏంటో ప్రూవ్ అయ్యింది. చిన్న సినిమాను ఆయన సపోర్ట్ చేస్తే ఎంత మైలేజ్ వస్తుందనడానికి ఇదే ఉదాహరణ.

సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసి…. దేశంలో దొంగలు పడ్డారు చిత్రాన్ని ఈ నెలాఖరులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange