అల్లుడు బాగున్నాడు.. నిల‌బ‌డ‌తాడా..?

అనుకున్న‌ట్లుగానే విజేత సినిమా మంచి టాక్ తోనే విడుద‌లైంది. చిరు చిన్న‌ల్లుడు ఎలా ఉన్నాడు అనే ప్ర‌శ్న‌ల‌కు సమాధానంగా విజేత విడుద‌లైంది. సాయి కొర్ర‌పాటి నిర్మించిన ఈ చిత్రాన్ని రాకేష్ శ‌శి తెర‌కెక్కించాడు. ముందు నుంచి చెబుతున్న‌ట్లే సినిమా అంతా పూర్తిగా తండ్రీ కొడుకుల మ‌ధ్య బంధం తోనే తెర‌కెక్కింది. హీరో కంటే ఎక్కువ‌గా ఇందులో ముర‌ళిశ‌ర్మ పాత్ర‌కు మార్కులు ప‌డిపోయాయి. హీరో తండ్రిగా త‌న కుటుంబంతో పాటు సినిమాను కూడా భుజాన వేసుకున్నాడు ఈ న‌టుడు.

ద‌ర్శ‌కుడు కూడా క‌థ మొత్తం చాలా తెలివిగా కొత్త హీరో అయిన క‌ళ్యాణ్ దేవ్ కంటే అనుభ‌వం ఎక్కువ‌గా ఉన్న ముర‌ళి శ‌ర్మ‌నే న‌మ్ముకున్నాడు రాకేష్. అత‌డిపైనే ఎక్కువ‌గా క‌థ న‌డిపించాడు. సెకండాఫ్ లో అయితే చాలా వ‌ర‌కు అత‌డి సీన్సే క‌నిపిస్తాయి. మ‌రీ ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే ముర‌ళి శ‌ర్మ అయితే ప్రాణం పోసాడు. మంచి ఫీల్ తో థియేట‌ర్ నుంచి బ‌య‌టికి రావ‌డానికి ఈ సీన్సే కార‌ణం. త‌న పాత్ర‌ను కూడా కాద‌ని.. హీరో తండ్రి పాత్ర‌కు అంత ప్రాముఖ్య‌త ఇస్తున్నా కూడా క‌ళ్యాణ్ ఏం మాట్లాడక‌పోవ‌డం నిజంగా గొప్ప విష‌య‌మే.
ఆకాశంలో కాకుండా తొలి సినిమాకు నేల‌మీదే ఉన్నాడు ఈ కుర్ర హీరో. ఇదే కంటిన్యూ చేస్తే ఇప్పుడు కాక‌పోయినా భ‌విష్య‌త్తులో అయినా క‌చ్చితంగా క‌ళ్యాణ్ దేవ్ స‌క్సెస్ అవుతాడు. విజేతలో మంచి క‌థ ఉన్నా.. కెమెరా భ‌యం మాత్రం క‌ళ్యాణ్ క‌ళ్ళ‌లో క‌నిపించింది. మ‌రో రెండు సినిమాలు చేసిన త‌ర్వాత ఈ బెరుకు మాయం అవుతుందేమో మ‌రి..! ఇప్ప‌టికైతే సాయి కొర్ర‌పాటి మ‌రే ప‌ని పెట్టుకోకుండా క‌చ్చితంగా విజేత‌ను ప్ర‌మోట్ చేసుకోవాలి. అలా చేస్తే కానీ చిన్న అల్లున్ని చూడ్డానికి థియేట‌ర్స్ కు జ‌నం క్యూ క‌ట్ట‌రు.

Leave a Reply

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial
Secured By miniOrange