రైత‌న్న రాజ్యం.. కార్తికి క‌లిసొచ్చేనా..?

 

దేశం ఏదైనా.. ప్రాంతం ఏదైనా అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే క‌థ‌లు కొన్ని ఉంటాయి. అందులో రైతుల‌ క‌థ‌ కూడా ఒక‌టి. ఇండ‌స్ట్రీ ఏదైనా.. అన్ని చోట్లా రైతులు ఒకేలా ఉంటారు. వాళ్ల క‌ష్టాలు కూడా ఒకేలా ఉంటాయి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో వ‌స్తున్నాడు కార్తి. ఈయ‌న న‌టించిన చిన‌బాబు పూర్తిగా రైతుల సినిమా. జులై 13న విడుద‌ల కానుంది ఈ చిత్రం. పాండిరాజ్ తెర‌కెక్కించిన చినబాబు ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రికొద్ది గంట‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఖాకీ లాంటి హిట్ త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఇప్పుడు ఈ చిన‌బాబుపై ఆస‌క్తి కూడా బాగానే ఉంది. పైగా ఈ చిత్రాన్ని కార్తి అన్న‌య్య సూర్య నిర్మించ‌డంతో అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

2డి ఎంట‌ర్ టైన్మెంట్స్ లో ఈ చిత్రం వ‌స్తుంది. స‌యేషా సైగ‌ల్ హీరోయిన్ గా న‌టించింది. టీజ‌ర్.. ట్రైల‌ర్లో రైతుల గురించి కార్తి చెప్పిన డైలాగులు ఇప్ప‌టికే బాగానే పాపుల‌ర్ అయ్యాయి. వ‌ర్షాకాలం.. రైతుల‌కు బాగా ఇష్ట‌మైన సీజ‌న్.. ఇలాంటి టైమ్ లో వ‌స్తున్న రైతు క‌థ ఈ చిత్రం. దీనికి కానీ పాజిటివ్ టాక్ వ‌చ్చిందంటే త‌మిళనాట మాత్రం వ‌సూళ్ల వ‌ర్షం కురవ‌డం ఖాయం. అయితే తెలుగులో మాత్రం చిన‌బాబు కాస్త క‌ష్ట‌ప‌డాల్సిందే. ఎందుకంటే అర‌వ వాస‌న‌లు మ‌రీ ఎక్కువ‌గా ఉన్నాయి ఈ క‌థ‌లో. ఇదొక్క‌టే చినబాబును టెన్ష‌న్ పెడుతుంది. తెలుగు వ‌ర్ష‌న్ కూడా దాదాపు 250 థియేట‌ర్స్ లో వ‌స్తుంది చిన‌బాబు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 700 స్క్రీన్స్ లో విడుద‌ల‌వుతుంది చిన‌బాబు.

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange