ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ కాస్టింగ్ కాల్

ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 3వ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విద్యా సాగర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కోసం 23 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసులో వుండే అబ్బాయి, 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసులో వుండే అమ్మాయి కోసం ఆడిషన్స్ నిర్వహించబోతున్నట్టు చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి తెలిపారు. అలాగే ఈ చిత్రం లో 12 నెలల పాప పాత్ర కీలకమైంది. ఈ పాత్రను కూడా ఆడిషన్ ద్వారానే ఎంపిక చేయనున్నారు. అల్ట్రా మోడ్రన్ లవ్ స్టొరీ కావడం వల్లే కొత్త వారితో సినిమా చేయనున్నట్లు నిర్మాత తెలిపారు…

ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ… ఎస్ ఆర్ టి బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 3 గా విద్యా సాగర్ దర్శకత్వంలో కొత్త వారితో సినిమా ప్రారంభిస్తున్నాం. హీరో, హీరోయిన్ తో పాటు 12 నెలల పాపను కూడా ఆడిషన్స్ నిర్వహించి ఎంపిక చేయనున్నాం. ఈ న్యూ ఏజ్ అల్ట్రా మోడ్రన్ రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించాలనుకునే వారు తమ రీసెంట్ పోర్ట్ ఫోలియో, డాన్స్ వీడియో ( ఒక నిమిషం), యాక్టింగ్ వీడియో (ఒక నిమిషం) auditions.srtentertainments@gmail.com
పంపించండి. ఈ వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా ఆడిషన్స్ కి సెలెక్ట్ చేస్తాం. మేము నిర్వహించే ఆడిషన్స్ ద్వారా హీరో హీరోయిన్ ని ఎంపిక చేస్తాం. మరోవైపు ఎస్ ఆర్ టి బ్యానర్ లో రవితేజ హీరోగా… వి ఐ. ఆనంద్ దర్శకత్వంలో సినిమా రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలతో అధికారికంగా ప్రకటిస్తాం. అని అన్నారు

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange