మొదటిసారి ఫుల్ లెంత్ రోల్ లో మన “ప్రజాకవి”. సినిమా మీద పెరిగిన భారీ అంచనాలు

మొదటిసారి ఫుల్ లెంత్ రోల్ లో మన “ప్రజాకవి”. సినిమా మీద పెరిగిన భారీ అంచనాలు.
మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజాకవి అంటే తెలియని వారు ఏవరూ ఉండరు. ఆ ప్రజాకవి స్వరాన్ని ఇష్టపడని వారు కూడా ఏవరూ ఉండరు. ఆయనే మన ప్రజాకవి గోరేటి వెంకన్న. జానపద గీతాలు, తెలంగాణ ఉద్యమ పాటలు పాడుతూ తనకంటూ ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కవి, ఈ మధ్య నటుడిగా కూడా మారారు. ఈయన పాటలు ఇష్టపడే వాళ్ళందరూ, ఈయన నటన ను కూడా ఇష్టపడటం మొదలు పెట్టారు. అయితే, ఈ మధ్య కాలంలో మన ప్రజాకవి పూర్తిస్థాయి నటుడిగా నటించిన సినిమా బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఎమ్.ఎస్ క్రీయేషన్స్ బ్యానర్ పై మహంకాళి శ్రీనివాసులు నిర్మించగా మాకం నాగసాయి దర్శకత్వం వహించారు. మాగంటి శ్రీనాథ్ మరియు శాన్వి మేఘన హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా ఈ మార్చి 15 న బ్రమ్మండంగా విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా తోట వి రమణ, మ్యూజిక్ సాబు, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ, మౌనశ్రి మల్లిక్, గోరేటి వెంకన్న, పోస్టర్ : వివ పోస్టర్స్. సరికొత్త కథ కథనాలతో పోలీస్ స్టేషన్ కామెడీ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు కూడా భారీగా నెలకొన్న తరుణంలో ఈ వారం విడుదల అవుతున్న ఈ సినిమా సూపర్ హిట్ అనే టాక్ అవుతుంది అనే నమ్మకం కూడా ప్రేక్షకులలో నేలకోనింది. నిర్మాత మహంకాళి శ్రీనివాసులు, రచన – దర్శకత్వం మాకం నాగసాయి. విడుదల మార్చి 15.

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial
Secured By miniOrange