భలే మంచి చౌక బేరమ్ మూవీ రివ్యూ

మారుతి కాన్సెప్ట్ అందించాడంటే ఏదో ఓ విషయం ఉంటుంది. అలా అతని కాన్పెప్ట్ తో తెరకెక్కిందే భలే మంచి చౌక బేరము. నవీద్ , నూకరాజు , యామిని భాస్కర్, రాజా రవీంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. మురళీ కృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే :

పార్థు (నవీద్), సలీమ్ (నూకరాజు) ఉద్యోగం కోసం దుబాయ్ కి వెళ్లే క్రమంలో.. ఓ దళారీ చేతిలో మోసపోయి, ఇక గత్యంతరం లేక హైదరాబాద్ లో చిన్న జాబ్ చేస్తూ గడిపేస్తుంటారు. మరో పక్క మాజీ ఆర్మీ మేజర్ అయిన (రాజా రవీంద్ర) భారత దేశ రహస్యాలు అనే ఫైల్ రాసి.. దాన్ని అమ్మేయాలని చూస్తాడు. అనుకోకుండా ఓ సంఘటన కారణంగా ఆ ఫైల్ కొరియర్ బాయ్ అయినా సలీమ్ (నూకరాజు)కి దొరుకుతుంది. దాంతో ఆ ఫైల్ ఓపెన్ చేసి సగం చదివి.. దేశ రహస్యాలను పాకిస్థాన్ కు అమ్ముదామని చూస్తాడు.

అయితే, మొదట్లో దీనికి ఒప్పుకొని పార్థు ఆర్థిక సమస్యల కారణంగా చివరికీ ఆ పని చేయడానికి అంగీకరిస్తాడు. ఈ క్రమంలో పాకిస్థానీ టెర్రరిస్ట్ అస్లమ్ బాయ్ తో డీల్ కుదుర్చుకుంటారు. అంతలో తన ఫైల్ కోసం వెతుకుతున్న రాజా రవీంద్రకి అది పార్థు, సలీమ్ ల దగ్గర ఉందని తెలుసుకుంటాడు. మరి వారి నుండి తన ఫైల్ ను తిరిగి సంపాదిస్తాడా ? లేదా ? అసలు ఆ ఫైల్ ను పార్థు, సలీమ్ తీవ్రాదులకు అమ్మారా ? అయినా ఆ ఫైల్ లో అంతగా రహస్యాలు ఏమున్నాయి ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ‘భలే మంచి చౌక బేరమ్’ చిత్రాన్ని చూడాల్సిందే.

సమీక్ష
పార్థు పాత్రలో నవీద్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో మరియు క్లైమాక్స్ లో నవీద్ చాలా బాగా నటించాడు. ఇక సినిమాలో మరో ప్రధాన పాత్ర అయిన సలీం పాత్రలో నటించిన నూకరాజు తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా బాగానే నవ్వించాడు. సీనియర్ నటుడు రాజా రవీంద్ర చాలా కాలం తరువాత ఈ సినిమాలోనే ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించారు. ఆయన ఇటు సిరియస్ గానూ అటు కామెడీగానూ మంచి టైమింగ్ తో సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచారు. ముఖ్యంగా ఈ ముగ్గురి కలయికలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగానే ఎంటర్టైనర్ చేస్తాయి. ఇక హీరోయిన్ పాత్రలో పార్థుకు ప్రియురాలుగా ఆదర్శీ (యామిని భాస్కర్) నటన పరంగానే కాకుండా, తన లుక్స్ అండ్ గ్లామర్ పరంగానూ బాగా ఆకట్టుకుంటుంది.

ఇక సినిమాలో ఊహించని ఇంటర్వెల్ ట్విస్ట్ మరియు సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు బాగా ఎంటర్ టైన్ చేస్తాయి. అలాగే దేశ భక్తి గురించే వివరించే ఎపిసోడ్ కూడా సినిమాకు హైలైట్ గా నిలుస్తోంది. కొత్త దర్శకుడు మురళీకృష్ణ సినిమాలోని కీలక సన్నివేశాలను బాగానే డీల్ చేశాడు. సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. దర్శకుడు మంచి కథను తీసుకున్నాడు. దాన్ని తీర్చిదిద్దిన తీరు బాగుంది. ఇలాంటి కథను ఎంచుకోవడం కత్తి మీద సామే. దాన్ని సమర్థవంతంగా రూపొందించాడు దర్శకుడు. బలమైన పాత్రలు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తాయి. ఇక టెర్రరిస్టులతో వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. విలన్ పాత్రను బాగా డిజైన్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ లో వినోదం పంచుతూ సందేశాన్ని ఇచ్చిన తీరు బాగుంది. ఇక హీరో ,హీరోయిన్ల లవ్ ట్రాక్ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో నూకరాజు చేసే కామెడీ బాగుంది.

చిత్ర దర్శకుడు మురళీశర్మ కు ఇదే మొదటి సినిమాయైన ఎక్కడా తడబడకుండా ఇటు కామెడీ తో పాటు చిన్న మెసేజ్ కూడా ఇవ్వడంలో విజయం సాధించారు. లాజిక్స్ పట్టించుకోకుండా చూస్తే ఎంజాయ్ చేయగలం. ఆయన కథ నడిపిన తీరు చాలా వరకు ఆకట్టుకుంది. కథను పకడ్బందీగా రాసుకొన్నారు. ఇక హరి గురువ అందించిన సంగీతం బాగుంది. సినిమాలో వున్న మూడు పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఇక ఉద్దవ్ ఎడిటింగ్ కూడా బాగుంది. బాల్ రెడ్డి అందించిన ఛాయాగ్రహణం సినిమాకు రిచ్ లుక్ ను తీసుకొచ్చింది. ఆరోళ్ళ సతీష్ కుమార్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా….
మురళీకృష్ణ దర్శకత్వంలో కామెడీ తో పాటు చిన్న మెసేజ్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. ముఖ్యంగా రాజా రవీంద్ర క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుంది. నూకరాజు , నవీద్ ల నటన , ఇంటర్వెల్ ట్విస్ట్ , సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ మరియు ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. సో గో అండ్ వాచ్….

PB Rating : 3/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange