బంగారి బాలరాజు మూవీ రివ్యూ

ఈ మధ్యకాలంలో…. పరువు హత్యల్ని చాలా చూశాం. తెలుగు రాష్ట్రాల్ని అట్టుడికించింది. ఇప్పుడు ఇదే నేపథ్యంలో తరకెక్కించిన చిత్రం బంగారి బాలరాజు. పరవు హత్య నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. నూతన దర్శకుడు కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా.. నంది క్రియేషన్స్ పతాకం పై కె.యమ్.డి.రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ‘బంగారి బాలరాజు’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ ప్రమోషన్ మధ్య ఈ చిత్రం విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే :

బాలరాజు (రాఘవ్ ) ఊర్లోనే ఉండి సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంటాడు. తల్లి స్కూల్ టీచర్. తల్లితో కలిసి ఉంటాడు. అలాంటి బాలరాజు చదువుకుంటూనే ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు.
అలాంటి బాలరాజు ఓ అమ్మాయి కళ్ళు చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. మరో వైపు ఆ ఊరి పెద్ద అయిన జగ్గారెడ్డి ఏకైక కూతురు బంగారి (కరోణ్య కత్రిన్) బాలరాజుని టీజ్ చేస్తూ రకరకాలుగా టార్చర్ పెడుతూ ప్రేమిస్తుంది. కానీ తాను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి తప్పించుకు తిరుగుతుంటాడు. కానీ తాను ప్రేమించిన అమ్మాయి తానే అనే విషయం తెలుసుకుంటాడు. అయితే తల్లికి మాత్రం ఈ ప్రేమ ఇష్టముండదు. జగ్గారెడ్డి కి కూడావీరి ప్రేమ వ్యవహారం తెలిసిపోతుంది. అలాంటి సందర్భంలో బాలరాజు తల్లి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది.

ఇంతకూ బాలరాజు ప్రేమించిన అమ్మాయిని ఎలా గుర్తు పట్టింది. బాలరాజునే బంగారి ఎందుుకు ప్రేమించింది. తల్లి ఎందుకు ప్రేమకు ఒప్పుకోలేదు. తల్లి తీసుకున్న నిర్ణయం ఏంటి. జగ్గారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. వీరి ప్రేమను అంగీకరించారా లేదా. బాలరాజు తన ప్రేమను దక్కించుకున్నాడా లేదా. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష

మొదటి సారి హీరోగా నటించిన రాఘవ్ చాలా బాగా నటించాడు. రాఘవ్ కి మంచి ఫ్యూచరుంది. లుక్స్ పరంగా బాగా కేర్ తీసుకున్నారు. దర్శకుడు రాఘవ్ తో యాక్టింగ్ బాగా చేయించాడు. ఎమోషనల్ సీన్స్ ని బాగా హ్యాండిల్ చేశాడు. హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేశాడు. యాక్షన్ పార్ట్ లోనూ పవర్ ఫుల్ గా కనిపించాడు. చాలా వరకు కాన్ఫిడెంట్ గా నటించాడు. డ్యాన్సులు బాగా చేశాడు. డైలాగ్స్ చెప్పడంలో ఎక్కడా తడబడలేదు. ఇక ఈ సినిమాకు మరో మెయిన్ హైలైట్ హీరోయిన్ కరోణ్య కత్రిన్. తన ఎక్స్ ప్రెషన్స్, ఎనర్జీ, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంది. కరోణ్యకు మంచి ఫ్యూచరుంది. చాలా సందర్భాల్లో తన భుజాల మీదేసుకని కథను నడిపించింది. తన కళ్లతో ఆకట్టుకుంది. హీరోతో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేయగలగింది. తెలుగులో మరిన్ని అవకాశాలు రావాడం ఖాయంగా కనిపించింది. ఇక హీరో తల్లి గా చేసిన మీనా కుమారి క్యారెక్టర్ కూడా బాగా పండింది. ఎమోషనల్ గా బాగాడ్రైవ్ చేసింది. సినిమాకు మెయిన్ హైలైట్స్ సీన్స్ తో హీరోయిన్ తండ్రితో హీరో తల్లి చెప్పే డైలాగ్స్. హీరో ఫ్రెండ్స్ పాత్ర ధారులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. శ్రవణ్ పోలీస్ ఆఫీసర్ గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు.

దర్శకుడు కోటేంద్ర దుద్యాల మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు. తన కాన్సెప్ట్ కి తగ్గట్టుగా సీన్స్ రాసుకున్నాడు. ఆర్టిస్టులు కొత్త వారు కావడంతో వారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గ డైలాగ్స్ యాక్షన్ రాసుకున్నాడు. ఫస్ట్‌ హాఫ్‌ అంతా సరదాగా సాగుతుంది. హీరోని హీరోయిన్ టీజ్ చేసే సీన్స్ బాగున్నాయి. సరదాగా సాగుతుంది. హీరోయిన్ సైతం దర్శకుడి సూచనలకు తగ్గట్టుగా పెర్ ఫార్మ్ చేసి ఆకట్టుకుంది. సాంగ్స్ బాగున్నాయి. హీరో హీరోయిన్ ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేశారు. అమ్మ సాంగ్ బాగుంది. సెకండాఫ్ ఎక్కువగా భావోద్వేగమైన సన్నివేశాలతో సాగుతుంది. క్లైమాక్స్ హైలైట్ గా నిలిచింది. స్క్రీన్ ప్లే పరంగానూ దర్శకుడు సక్సెస్ ఆయ్యాడు. నిర్మాతలు క్వాలిటీ మెయింటైన్ చేశారు. జి.ఎల్. బాబు కెమెరా వర్క్ , ఎడిటింగ్ బాగుంది. చిన్నికృష్ణ – చిట్టిబాబు రెడ్డిపోగు మ్యూజిక్ రీ రికార్డింగ్ సినిమాకు బాగా ఉపయోగపడింది. ఇంటర్వెల్ బ్యాంగ్ రీ రికార్డింగ్ బాగుంది.

హీరో క్యారెక్టరైజేషన్ సింపుల్ గా పవర్ ఫుల్ గా ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ ఎనర్జీటిక్ గా బ్యూటిఫుల్ గా ఉంది. ప్రేక్షకుల్ని కట్టిపడేసే కథ, కథనం, పాటలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ నేటి జనరేషన్ పేరెంట్స్, పిల్లలు తప్పకుండా చూడాల్సిన చిత్రం.

రేటింగ్ :3.25/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange