అర్జున్ రెడ్డి మ‌త్తు వ‌ద‌ల‌దా..?

 

పాత్ బ్రేకింగ్ మూవీస్ అనేవి ఎప్పుడో కానీ రావు. అవి వ‌చ్చిన‌పుడు చూసి ఆనందించాలి కానీ వ‌చ్చింది క‌దా అని దాన్ని కాపీ కొట్టి మ‌ళ్లీ ఇంకో సినిమా చేయ‌కూడ‌దు.. చేసి చూడండి మాది కూడా అలాంటి సినిమానే అని చెప్పుకోకూడ‌దు. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇదే జ‌రుగుతుంది. అర్జున్ రెడ్డి ఒక్క సారి జ‌రిగిన మ్యాజిక్. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు సందీప్ కూడా ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టారు. కొంద‌రికి న‌చ్చ‌క‌పోయినా.. ఓ వ‌ర్గానికే ఈ సినిమా ప‌రిమితం అయినా కూడా అర్జున్ రెడ్డి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా.

అలా కుదిరింది ఈ చిత్రానికి. ఆ సినిమా వ‌ర్క‌వుట్ అయింది క‌దా అని అన్ని సినిమాలు ఇలాగే ఉంటాయ‌నుకోవ‌డం అవివేక‌మే. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి. ఇప్పుడు విడుద‌లైన ఆర్ఎక్స్ 100 ను ప్ర‌మోట్ చేసుకోవ‌డం కూడా అర్జున్ రెడ్డికి డూప్ లాగే చేసారు. పైగా ఇష్ట‌మొచ్చినట్లు ముద్దు సీన్లు పెట్టేసి.. బోల్డ్ కంటెంట్ అంటూ తీసేసారు. యూత్ ను టార్గెట్ చేస్తున్నారనే విష‌యం తెలుసు కానీ అందులో కాస్త నిజాయితీ కూడా ఉండుంటే బాగున్ను అంటున్నారు వాళ్లు.
అర్జున్ రెడ్డి ప్రేమ‌లో క‌నిపించిన నిజాయితీ.. ఇక్క‌డ ఆర్ఎక్స్ 100లో లేదు. ముఖ్యంగా హీరోయిన్ కారెక్ట‌ర్ ను ద‌ర్శకుడు డిజైన్ చేసిన విధానం ఆక‌ట్టుకోలేదు. హీరో బాగానే చేసినా అది సినిమాకు స‌రిపోదు. క‌ర్ణుడి చావుకు ల‌క్ష కార‌ణాల‌న్న‌ట్లు ఆర్ఎక్స్ 100 ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌క‌పోవ‌డానికి కూడా కార‌ణాలు బాగానే ఉన్నాయి. అర్జున్ రెడ్డి పేరు ఎత్త‌కుండా ప్ర‌మోట్ చేసుకుని ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేదేమో..?

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange