నిర్మాత‌ల‌తో చెప్పి 30 ల‌క్ష‌లు ఇప్పించాడు

విడుద‌ల‌కు సిద్ధ‌మైన స‌ర్కార్ పై అంచ‌నాలు ఎన్ని ఉన్నాయో.. అనుమానాలు కూడా అన్నే ఉన్నాయి ఇప్పుడు. సినిమా బాగుంటుందా లేదా అనే విష‌యంపై ఇప్పుడు ఎవ‌రూ మాట్లాడ‌టం లేదు. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా సినిమా బాగుంటుంద‌నే న‌మ్ముతున్నారు. పైగా మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఇంకా న‌మ్మ‌కం ఎక్కువైపోయింది. అయితే ఇప్పుడు అంతా అనుకుంటున్న‌ది మాత్రం ఈ క‌థ నిజంగానే మురుగ‌దాస్ సొంత క‌థా లేదంటే వ‌రుణ్ రాజేంద్ర‌న్ ఆరోపిస్తున్న‌ట్లు ఇది అక్క‌డ్నుంచి మురుగ‌దాస్ ఎత్తుకొచ్చాడా..?
ఇదే ఇప్పుడు అందర్లోనూ ఉన్న అనుమానం. రెండు రోజుల కింద ఎంత‌వ‌ర‌కు వెళ్తారో వెళ్లండి.. తాను మాత్రం వెన‌క్కి త‌గ్గేది లేదు.. ఇది నా సొంత క‌థ‌.. కోర్ట్ కు వెళ్ల‌డానికి సిద్ధ‌మే అని చెప్పిన మురుగ‌దాస్ అంత‌లోనే కాంప్ర‌మైజ్ చేసుకున్నాడు. వ‌రుణ్ రాజేంద్ర‌న్ కు నిర్మాత‌ల‌తో చెప్పి 30 ల‌క్ష‌లు ఇప్పించాడు. త‌గ్గితే త‌ప్పేం లేద‌ని ఎన్టీఆర్ అర‌వింద స‌మేతలో చెప్పిన‌ట్లు సైలెంట్ అయిపోయాడు.
ఇప్ప‌టికీ క‌థ నాదే అని చెబుతూనే ఇప్పుడు కోర్టులు అంటూ తిరిగితే రిలీజ్ డేట్ ద‌గ్గ‌రికి వ‌చ్చేస్తుంద‌ని అందుకే కాంప్ర‌మైజ్ అయ్యానంటున్నాడు మురుగ‌దాస్. మ‌రోవైపు త‌న త‌ప్పు లేన‌ప్పుడు అలా డ‌బ్బులు ఇస్తే మురుగ‌దాస్ పైనే లేనిపోని అనుమానాలు వ‌స్తాయి క‌దా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. అయితే ఎవ‌రేం అనుకున్నా అనుకున్న టైమ్ కు సినిమా రిలీజ్ కావ‌డ‌మే త‌న‌కు ముఖ్యం అంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange