అంతర్వేదమ్ మూవీ రివ్యూ…

ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన చిత్రం “అంతేర్వేదమ్”. చందిన రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ కావడంలో అంచనాలు ఏర్పడ్డాయి. అమర్, సంతోషి, షాలు చౌరస్య, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, కమెడియన్ సాయి, జబర్దస్త్ మహేష్ ,దొరబాబు, రవి, లడ్డు, యోగి తదితరులు నటించారు. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉందో లేదో చూద్దాం.

‌కథేంటంటే…
సోషియో ఫాంటసీ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. దర్శకుడు కథ బాగా రాసుకున్నాడు. ఆత్మల నేపథ్యంతో ‘అంతర్వేదమ్’ కథ నడుస్తుంది. అమర్ కు ఓ కల వస్తుంది. ఆ కలలో అతన్ని ఆల్ మోస్ట్ చంపేసినంతగా భయపెడుతుంది ఆ కల. అలాంటి కల ఓ మరో మూడు, నాలుగు సార్లు వస్తే… అతడు చనిపోతాడని.. దానికి విరుగుడు తాళపత్రాల గ్రంథాలలో వుందని తెలుసుకుని ఓ డాక్టర్ కం సైకియాట్రిస్టు సహాయంతో ఓ యాగం చేయడానికి పూనుకుంటారు. మరి ఆ యాగాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగారా? అమర్ ప్రాణాలను ఎలా దక్కించుకున్నాడు? అతన్ని నిజంగా చంపాలని ప్రయత్నించింది ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష
నటీనటులందరూ చాలా బాగా చేశారు. అందరికీ మంచి పేరొస్తుంది. ఎమోషనల్ సీన్స్ లోనూ హీరో బాగా నటించాడు. లీడ్ పెయిర్ ఇద్దరూ చాలా చక్కగా నటించారు. రొమాంటిక్ సాంగ్ లో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. తనికెళ్ల భరణి కొద్దిసేపే ఉన్నప్పటికీ… బాగా యాప్ట్ క్యారెక్టర్లో నటించాడు. యోగి డాక్టర్ కమ్ సైకియాట్రిస్టు పాత్రను పోషించి ఆకట్టుకున్నాడు. దర్శకుడు కొత్త పాయింట్ ను ఎంచుకొని సక్సెస్ అయ్యాడు. హార్రర్ ఎలిమెంట్స్ ని బాగా డీల్ చేశాడు. భయపెట్టే విషయంలో దర్శకుడి టాలెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేం. పోసాని, జబర్దస్థ్ మహేష్ లాంటి వాళ్లతో నవ్విస్తూ… ప్రేక్షకులను మెప్పించడానికి ‘అంతర్వేదమ్’ చిత్రాన్ని ఓ సోషియో ఫాంటసీగా మలిచి సక్సెస్ అయ్యారు. చనిపోయిన తర్వాత మనిషి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి. వాటిని బంధిస్తే జరిగే పరిణామాలేంటి… ఆత్మలు మళ్లీ మనిషి రూపంలో బతుకుతాయా ఇలాంటి విషయాల్ని బాగా చెప్పాడు. తాళపత్ర గ్రంథాల నుంచిఈ విషయాల్ని తెలుసుకునే సీన్స్ రక్తి కట్టించాయి. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. కథను నడిపించిన విధానం ఆసక్తికరంగా ఉంది. యాగం చుట్టూ తిరిగే సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయి. కొత్త దర్శకుడు డీల్ చేసినట్టుగా అనిపించదు. వైవిధ్యమైన పాయింట్ ను తెరమీదకు తెచ్చాడు.

శివ దేవరకొండ కెమెరామెన్ గా సక్సెస్ అయ్యాడు. మంచి విజువల్ బ్యూటీ అందించాడు. చాలా సీన్స్ లో ఆయన పనితనం కనిపించింది. జె.యెస్.నిథిత్ సంగీతం దర్శకత్వం వహించారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని ఎలివేట్ చేశారు. చాలా సన్నివేశాలకు రీ రికార్డింగ్ బాగా హెల్పయ్యింది. రొమాంటిక్ సాంగ్ ను బాగా కంపోజ్ చేశాడు. కళ్యాణ్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. క్వాలిటీగా సినిమాను నిర్మించారు. గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు. కథకు ఈ గ్రాఫిక్స్ ప్రాణం. వాటిని హై టెక్నికల్ గా డిజైన్ చేశారనిపించింది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

సోషియో ఫాంటసీ చిత్రాలు చాలా అరదుగా వస్తుంటాయి. అలాంటి వాటిలో వైవిధ్యమైన కథ, కథనం, మంచి గ్రాఫిక్స్ ఉన్న అంతర్వేదమ్ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. సోషయో ఫాంటసీ చిత్రాల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుంది. సో గో అండ్ వాచ్….

రేటింగ్: 2.75/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange