అంతకు మించి మూవీ రివ్యూ

రష్మి గౌతమ్ కు ఉన్న ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బబర్దస్త్ పుణ్యమా అని ప్రతీ ఇంట్లోని వారికి రష్మీ గౌతమ్ గురించి తెలుసు. దానికి తోడు ఆమె హాట్ హాట్ అందాలు యూత్ కి పిచ్చెక్కిస్తుంటాయి. అలా అంతకు మించి సినిమాకు బజ్ ఏర్పడింది. కేవలం ఒకే ఒక పోస్టర్ తో హీటెక్కించింది అంతకు మించి మూవీ టీం. జై హీరోగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. జానీ డైరెక్షన్ లో తెరకెక్కించారు. ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పిస్తున్న ఈ సినిమాకు నిర్మాతలు : జై, స‌తీష్, ప‌ద్మ‌నాభ‌రెడ్డి. సునీల్ క‌శ్య‌ప్ సంగీతమందించారు. బాలిరెడ్డి సినిమాటోగ్రాఫర్. మరీ ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ విషయానికి వస్తే…
రాజు (జై)కి డబ్బు పిచ్చి పట్టుకుంటుంది. ఎలాగైనా మిలియనియర్ కావాలనేది టార్గెట్. తన లైఫ్ ను జాలీగా గడిపేస్తుంటాడు. అయితే దెయ్యం ఉందని నిరూపిస్తే 5 కోట్లు సంపాదించొచ్చని తెలుసుకొని ఆ పనిమీదుంటాడు. అయితే తన సోదరి ఇంట్లో విచిత్రమైన సంఘటనల్ని చూస్తాడు. అక్కడే దెయ్యం ఉందని డిసైడ్ అవుతాడు. దెయ్యం ఉందని ఎలాగైనా నిరూపించాలని ట్రై చేస్తుంటాడు. మరోవైపు
ప్రియ (రష్మి) మాత్రం దెయ్యం లేదని ప్రూవ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. దెయ్యం ఉందని రాజు, దెయ్యం లేదని ప్రియ నిరూపించేందుకు ట్రై చేస్తుంటారు. ఇంతకూ దెయ్యం ఉందా లేదా. రాజు గెలిచాడా ప్రియ గెలిచిందా. 5 కోట్ల బహుమతి రాజు గెలుచుకున్నాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష
ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ రష్మి. మోస్ట్ సెల్లింగ్ పాయింట్ ఆమెనే. రష్మి కోసం జనాలు థియేటర్లకు వచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లో మాదిరిగానే రష్మి హాట్ హాట్ గా కనిపించింది. ఓ పాటలో ఆందాలు ఆరబోసింది. తన అందంతో అభినయంతో మెప్పించింది. క్లైమాక్స్ లో డిఫరెంట్ షేడ్ చూపించి సర్ ప్రైజ్ చేసింది. హీరో జై చాలా బాగున్నాడు. మంచి ఫ్యూచర్ ఉంది. రష్మితో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేశాడు. రష్మితో రొమాంటిక్ సీన్స్ లో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేశాడు. కమెడియన్ మధు తన కామెడీ టైమింగ్‌ తో నవ్వించాడు.

హార్రర్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి. కాస్త భయం, కాస్త సస్పెన్స్, కాస్త రొమాన్స్, మరి కాస్త కామెడీ… దర్శకుడు బాగానే ప్లాన్ చేశాడు. దానికి తోడు హీరో హీరోయిన్స్ పెర్ ఫార్మెన్స్ సినిమాకు బాగా హెల్పయ్యింది. సహజంగా జరుగుతున్నట్టుగా ఉంటాయి. సన్నివేశాల్ని బాగా రాసుకున్నారు. ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. రష్మి, మధు లాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ లను బాగా వాడుకున్నాడు. స్టోరీ లైన్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆడియెన్స్ కి బోర్ కొట్టదు. సరదాగా కాలక్షేపం అయిపోతుంది. దర్శకుడు జానీ తన స్థాయిలో హార్రర్ సినిమాతో మెప్పించగలిగాడు. పి.బాలిరెడ్డి కెమెరా పనితనం హార్రర్ సన్నివేశాలల్లో చాలా వరకు హెల్ప్ అయ్యింది. స్క్రీన్ ను బ్యూటీగా మలిచాడు. సునీల్ క‌శ్య‌ప్ అందించిన సంగీతం బాగా వర్కవుట్ అయ్యింది. రీ రికార్డింగ్ చాలా బాగా ఇచ్చాడు. జై, స‌తీష్, ప‌ద్మ‌నాభ‌రెడ్డి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా….
పోస్టర్స్, ట్రైలర్స్ తో విపరీతంగా ఆకట్టుకున్న అభిమానుల్ని డిసప్పాయింట్ మాత్రం చేయదు. హార్రర్ జోనర్ ఆడియెన్స్ ఇంకా బాగా నచ్చుతుంది. రష్మి ఫ్యాన్స్ కి పండగ లాగే ఉంటుంది. డిఫరెంట్ షేడ్ లో రష్మీని చూడొచ్చు. ఓవరాల్ గా అంతకు మించి కంటెంట్ ఉన్న సినిమా.

PB Rating : 3/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange