అనగనగా ఓ ప్రేమ కథ… క్యూట్ అండ్ కన్ఫ్యూజన్ టీజర్

అనగనగా ఓ ప్రేమ కథ. ఈ చిత్ర టీజర్ రిలీజైంది. ఈ సినిమాకు సంబంధించిన వారంతా కొత్తవారే. హీరోయిన్ రిద్ది మాత్రమే లవర్ చిత్రం తో మనకు పరిచయమైంది. హీరో విరాజ్ ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడు. దర్శకుడు ప్రతాప్ కొత్త కుర్రాడు. అంతా కొత్త వారైనా టీజర్ తో ఎట్రాక్ట్ చేయగలిగారు. రానా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేయడంతో అంతా ఈ సినిమాపై ఓకన్నేశారు.

క్వాలిటీ విషయంలో చిత్ర దర్శక నిర్మాతలు కాంప్రమైజ్ కాలేదనిపించింది. దర్శకుడు ప్రతాప్ క్యూట్ గా టీజర్ ను కట్ చేయించాడు. లవ్ స్టోరీ గురించి చెబుతూనే ఎండ్ లో హీరోయిన్ ఇచ్చే కన్ఫ్యూజన్ ట్విస్ట్ తో క్యూరియాసిటీ రేకెత్తించాడు. టాప్ క్లాస్ విజువల్స్, ఫ్రెష్ మ్యూజిక్, క్యూట్ పెయిర్, డైరెక్టర్ టేకింగ్, క్వాలిటీ మేకింగ్ టీజర్ లో కనిపించాయి. ఈ మధ్య చిన్న సినిమాలు భారీ విజయాలు అందుకుంటున్నాయి. ఈ తరుణంలో వస్తున్న అనగనగా ఓ ప్రేమ కథ కూడా సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.

విరాజ్.జె .అశ్విన్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ వద్ద అసోసియేట్ గా పనిచేసిన టి.ప్రతాప్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాత డి వి ఎస్ రాజు గారి అల్లుడు కె. ఎల్.ఎన్ రాజు గారు గత ౩౦ సంవత్సరాలుగా సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొంది ఉన్నారు. చాలా రోజుల తర్వాత నిర్మాత గా థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్ ను స్థాపించి ఈ ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ
నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange