అనగనగా ఓ ప్రేమ కథ మూవీ రివ్యూ

ప్రేమ కథలు ఎన్నో వస్తుంటాయి. వాటిలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు సైతం ఇష్టపడట్లేదు. అందుకే కొత్త దర్శకుడు ప్రేక్షకుల్ని మెప్పించేందుకు కొత్త పాయింట్ తో సినిమాలు తీస్తు సక్సెస్ సాధిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి నూతన దర్శకుడు తాతంశెట్టి. అనగనగా ఓ ప్రేమ కథ చిత్రాన్ని తెరకెక్కించాడు. విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు హీరో హీరోయిన్స్ గా నటించారు. థౌజెండ్‌ లైట్స్‌ మీడియా ప్రై.లి బ్యానర్‌ పై కె.ఎస్.ఎన్.రాజు నిర్మాతగా నిర్మించిన తొలి చిత్రం. మరి ఈ ప్రేమ కథలో కొత్తదనమేంటి. ఈ కొత్త ప్రేమ కథను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించే అవకాశముందో చూద్దాం.

కథేంటంటే…. ఇది విభిన్నమైన పాయింట్ తో రూపొందించిన చిత్రం. మన తెలుగు సినిమాల్లో ఎన్నడూ చూడని పాయింట్ ను టచ్ చేశాడు దర్శకుడు.. ఇది ఒక టిపికల్ లవ్ స్టోరీ. టెక్నాలజీ అన్నది రోజురోజుకు పెరుగుతుంది. సృష్టికి ప్రతి సృష్టి చేసే స్థాయికి మనిషి వెళ్లాడు. కానీ టెక్నాలజీ ఎంత పెరిగినా అది మన ఫైవ్ సెన్సెస్ కు లోబడే ఉండాలి. అలా కానప్పుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పే కథాంశమిది. లవ్, టెక్నాలజీ, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ వంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్న కంప్లీట్ స్టోరీ ఇది. సూర్య ఎలాంటి టెన్షన్ లేకుండా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఆర్కిటెక్ట్ గా పనిచేస్తుంటాడు. అమ్మాయిల్ని పడేయడంలో మనడో చాలా ఫాస్ట్ గా ఉంటాడు. అనన్య (రిద్దికుమార్‌) సూర్య ఎదురెదురు ఇళ్లలోనే ఉంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్. సూర్య అంటే అనన్యకి చెప్పలేనంత ప్రేమ. కానీ తన ప్రేమను వ్యక్తం చేయదు. కేవలం పూలతో తన ప్రేమను తెలియజేస్తుంది. తాను ఏం చెప్పాలనుకున్నా సముద్రానికి చెప్పుకుంటుంది. సూర్య ఎవరితో తిరిగినా చివరికి తన ప్రేమ కోసం తన దగ్గరికే వస్తాడని బలంగా నమ్ముతుంది. తన ప్రేమ గురించి తండ్రి (అనీష్) కి కూడా చెబుతుంది. తండ్రి కూడా ఓకే అంటాడు. అదే సమయంలో పూజ( రాధా బంగారు) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ విషయం అనన్యకు కూడా చెబుతాడు. కానీ పూజ మాత్రం వేరే కుర్రాడిని ప్రేమించి వెళ్లిపోతుంది. అదే సమయంలో అనన్య తనను ప్రేమిస్తుందని చెప్పిన ఓ వీడియో చూస్తాడు. దీంతో తన అసలు ప్రేమను తెలుసుకుంటాడు. అనన్య దగ్గరికి వెళ్లి తన ప్రేమను కూడా తెలియజేయాలనుకుంటాడు. కానీ అనన్య మాత్రం సూర్యను ఎవరు నువ్వు అంటూ షాక్ ఇస్తుంది. తానెవరో తెలియనట్టుగా బిహేవ్ చేయడంతో సూర్య షాక్ అవుతాడు. అనన్య ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కాదు. ఇంతకూ అనన్య ఎందుకు అలా బిహేవ్ చేసింది. సూర్యను అంతగా ప్రేమించిన అనన్యకు సడన్ గా ఏమయ్యింది. అనన్య తండ్రి ఈ విషయంలో ఎలా రియాక్డ్ అయ్యాడు. సూర్య తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు. అనన్య సూర్య ప్రేమను దక్కించుకుందా లేదా అన్నది అసలు కథ.

సమీక్ష
ముందుగా చెప్పినట్టుగా విభిన్నమైన ప్రేమ కథా చిత్రం. ఎంతగానో ప్రేమించిన అమ్మాయి… సడన్ గా హీరోను నువ్వు ఎవరో తెలియదనే ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. అప్పటివరకు సినిమా సరదాగా సాగుతుంది. హీరో వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నా…. అనన్య మాత్రం తన ప్రేమ మాత్రం స్వచ్ఛమైందని నమ్మే పాజిటివ్ క్యారెక్టరైజేషన్ బాగుంది. హీరో విరాజ్ తన పాత్రకు న్యాయం చేశాడు. కొత్త వాడైనప్పటికీ దర్శకుడు హీరోతో బాగా చేయించాడు. హీరో హీరోయిన్ మధ్య మంచి కెమిస్ట్రీ మెయింటైన్ అయ్యేలా చూశాడు. సెకండాఫ్ కథ మలేషియాలో జరుగుతుంది. తన ప్రేమను దక్కించుకునేందుకు హీరో మలేషియా వెళ్తాడు. అక్కడ తన ప్రేమను తిరిగి ఎలా పొందాడనేది దర్శకుడు బాగాడీల్ చేశాడు.

ఓ వ్యక్తి నుంచి మెమెరీని డిలీట్ చేసే అంశం గురించి చాలా వరకు తెలీదు. కానీ దర్శకుడు ఆ పాయింట్ ను టేకప్ చేసి ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పగలిగాడు. కీలకమైన ఈ పాయింట్ ను టెక్నికల్ గా గ్రాఫిక్స్ ను ఉపయోగించి చెప్పాడు. ఇలా కూడా జరుగుతుందా అని ప్రేక్షకుల్ని ఆలోచింపచేసేలా సీన్స్ ని డిజైన్ చేశాడు. స్క్రీన్ ప్లే పరంగానూ దర్శకుడు పక్కాగా ప్లాన్ చేశాడు. హీరోయిన్ ఎందుకు మర్చిపోయింది అనే ట్విస్ట్ రివీలింగ్ పాయింట్ ను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఆ తర్వాత హీరోయిన్ కు గతం గుర్తుకు తెచ్చేలా చేసే ప్రయత్నాలు ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. మధ్య మధ్యలో నల్లవేణు, లిండా లవ్ ట్రాక్ ఫన్నీగా సాగుతుంది. కామెడీ పార్ట్ ను నల్ల వేణు తన భుజాలమీదేసుకున్నాడు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ టాక్స్ హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఆ తర్వాత విడిపోయిన తర్వాత భావోద్వేగమైన సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. ఓ వైపు ఎమోషన్, మరోవైపు సరదా సీన్స్ తో దర్శకుడు బ్యాలెన్స్ చేశాడు.
టెక్నికల్ గా ఈ సినిమాకు మెయిన్ హైలైట్ మ్యూజిక్. పాటలన్నీ బాగా కుదిరాయి. ఏ పాటకు ఆ పాట స్పెషల్ గా ఉంటుంది. రీ రికార్డింగ్ మరో ప్లస్ పాయింట్. మ్యూజిక్ డైరెక్టర్ కె.సి.అంజన్ మంచి పాటలిచ్చి సినిమా కథకు బాగా ఉపయోగపడ్డాడు. ఎదురొలు రాజు కెమెరా వర్క్ చాలా బాగుంది. ప్రతీ సీన్ ను, ప్రతీ సాంగ్ ను రిచ్ విజువల్స్ తో చిన్న సినిమా అనే ఫీలింగ్ రాకుండా చేశాడు. మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. అయితే ఇంకాస్త షార్ప్ ఎడిటింగ్ చేసుంటే బాగుండేది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా అక్కడక్కడ చిన్న చిన్న బోరింగ్ సన్నివేశాలున్నప్పటికీ…. దర్శకుడు ప్రతాప్ దర్శకుడిగా తన టాలెంట్ చూపించాడు. విభిన్నమైన పాయింట్ ను ప్రేక్షకులకు అందించాడు. డిఫరెంట్ లవ్ స్టోరీని టచ్ చేశాడు. అయితే ప్రమోషన్ లో హడావిడి పెంచి, గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేసుంటే చాలా మంది ప్రేక్షకులకు రీచ్ అయి ఉండేది. ఏదైమైనా అనగనగా ఓ ప్రేమ కథ ఆకట్టుకునే ఓ విభిన్నమైన ప్రేమ కథా చిత్రం.

PB Rating : 3/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange