సినిమాలు చేయడానికే టైమ్ సరిపోవడం లేదంటున్నాడు.. మళ్లీ పాలిటిక్స్ లోకి వచ్చి ఏం చేస్తాడు..? అసలు ఈయనకు అంత టైమ్ ఎక్కడుంది అనుకుంటున్నారా..? ఏమో వచ్చినా వస్తాడేమో..? అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం కోసం ప్రచారం చేసాడు కదా.. అలాగే ఇప్పుడు జనసేన కోసం జనం మధ్యలోకి వచ్చినా వస్తాడేమో..? అయితే అదంతా ఆయన ఇష్టం. కానీ మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటున్నది మాత్రం సినిమాల గురించే. అసలే ఇప్పుడు తెలుగులో పొలిటికల్ కథలకు మాంచి డిమాండ్ ఉంది.
ప్రేక్షకులు మెచ్చే కథ చెప్పాలే కానీ బాక్సాఫీస్ పంబ రేగిపోద్ది. గత ఏడాది కాలంగా నేనేరాజు నేనేమంత్రి.. భరత్ అనే నేను.. రంగస్థలం లాంటి పొలిటికల్ కథలు వచ్చాయి. అన్నీ విజయాలే. ఇప్పుడు బన్నీ కూడా ఇలాంటి కథ వైపు మనసు పడ్డాడని తెలుస్తుంది. అది కూడా దిల్ రాజు కంపౌండ్ లోంచి వస్తుందని తెలుస్తుంది. వేణు శ్రీరామ్ సభకు నమస్కారం అంటూ ఓ కథ సిద్ధం చేసాడని.. దీన్ని ముందు నానికి వినిపించారని.. అయితే ఆయన ఉన్న బిజీ కారణంగా చేయలేకపోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఇదే కథను బన్నీ దగ్గరికి దిల్ రాజు తీసుకెళ్లాడని ప్రచారం జరుగుతుంది. ఎలాగూ మంచి కథ దొరికితే చేద్దామని చూస్తున్న బన్నీకి సభకు నమస్కారం ఆకట్టుకున్నట్లుగానే ఉంది. పైగా ఇప్పుడు పొలిటికల్ హీట్ కూడా నడుస్తుంది కాబట్టి ఇలాంటి కథ చేస్తే బాగుంటుందని దిల్ రాజు బన్నీకి సూచించినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి దీనిపై బన్నీ ఏం అంటాడు.. నిజంగానే సభకు నమస్కారం పెడతాడా లేదా అనేది కొన్ని రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది.
బన్నీ పాలిటిక్స్ లోకి వస్తున్నాడా..?
