సినిమా పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. తమ ట్యాలెంట్ నిరూపించుకునే అవకాశం రావాలేగానీ…తక్కువ సమయంలోనే ఇక్కడ వచ్చినంత నేమూ, ఫేమూ మరే రంగంలోనైనా సాధించగలగడం దాదాపు అసాధ్యం. అందుకే సహజంగానే ఈ ఇండస్ట్రీకి యూత్ అట్రాక్ట్ చేయగల శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ జరిగే ఏ విషయాలైనా సామాన్య జనానికి ఆసక్తి కలిగించే వార్తలవుతాయి. అయితే ఇటీవల కొన్ని సినిమాల్లో హీరోయిన్లుగా నటించి హఠాత్తుగా తెరమరుగైపోయిన కొంతమంది అమ్మాయిలు ఈ పరిశ్రమలో తమకెదురైన అనుభవాలను, బయటపెడుతున్నసంచలన అంశాలను పరిశీలిస్తే చిత్ర పరిశ్రమ వెలుగు జిలుగుల వెనుక దాగి ఉన్నమరో కోణం బయటపడుతోంది.
అయితే పరిశ్రమలో ఈ రకమైన మనుషులు కొందరే ఉండవచ్చు. అలాగే మారుతున్న సంస్కృతి నేపథ్యంలో ఇతర రంగాలు ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేకపోవచ్చు.. కానీ సినీ పరిశ్రమనుంచి వచ్చిన వార్తలకు ఉండే ప్రాధాన్యం వాటికి ఉండదు మరి. సినీ పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’ సంస్కృతి చాలా ఎక్కువని, అవకాశాల కోసం లొంగిపోక తప్పదని కొంతకాలంగా ఎంతో మంది హీరోయిన్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అర్చన, మాధవీలత, వరలక్ష్మీ శరత్‌కుమార్, కస్తూరి, రాధికా ఆప్టే వంటి హీరోయిన్లు ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించి ఇటీవల సంచలనం సృష్టించారు.
ఇక ఇప్పుడు మలయాళ నటి పార్వతి మీనన్ కూడా తనకు ఎదురైన అనుభవాల గురించి నోరు విప్పింది. ఈమె తమిళ సినీ పరిశ్రమలో ధనుష్‌తో ‘మారియన్’, ఆర్య, రానాలతో ‘బెంగళూరు డేస్’ వంటి సినిమాలు చేసి మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ఈమె తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి గురించి బోల్డ్‌గా చాలా విషయాలే మాట్లాడింది.
ఆమె ఏమందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం…! ‘ప్రస్తుతం సినీ పరిశ్రమ గురించి జరుగుతున్న ప్రచారం నూరుశాతం నిజమే. అక్కడ అవకాశాలు కావాలంటే అమ్మాయాలు అన్నింటినీ వదులుకోవాల్సిందే. అవకాశం కావాలంటే బెడ్రూమ్కు రమ్మని డైరెక్ట్‌గానే అడుగుతారు. మలయాళ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో పలువురు హీరోలు, దర్శకులు నన్ను తమ బెడ్రూమ్కు రమ్మనేవారు. అవకాశాలు కావాలంటే ఇలాంటివన్నీ కామన్ లైట్ తీస్కోవాలి.. అని సర్దిచెప్పేవారు. నేను అందుకు ‘నో’ చెప్పడం వల్లే ఇప్పుడు అవకాశాలు లేక ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. బెడ్రూమ్ వ్యవహారానికి సిద్ధపడి ఉంటే ఇప్పటికి చాలా సినిమాలు చేసేదాన్ని’ అని చెప్పింది పార్వతి. మరి ఈ వరుస ఘటనలు చూశాక… కొంతమంది ఉమనైజర్ల కారణంగా ఇండస్ట్రీ ఇమేజ్‌నే దెబ్బతినే పరిస్థితి రాకుండా పరిశ్రమ పెద్దలు జాగ్తత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఐతే కనిపిస్తోందనే చెప్పాలి.
Leave a Reply
You must be logged in to post a comment.