4 లెటర్స్ మూవీ రివ్యూ…

ఈ మధ్య కాలంలో భారీ ప్రమోషన్ నడుమ గ్రాండ్ గా రిలీజ్ చేసిన సినిమా ఇదే. ఈ సినిమాతో ఈశ్వర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఏ. ర‌ఘురాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ స్థాపించి ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు ఈ సినిమా నిర్మించారు. క్వాలిటీ విషయంలో, ప్రమోషన్ విషయంలో ఎక్కడా తగ్గకుండా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
.
కథేంటంటే….

హీరో అజయ్ (ఈశ్వర్) రిచ్ ఫ్యామిలీ కుర్రాడు. కాలేజ్ లో చదువుతుంటాడు. ఇంజినీరింగ్ ని సరదాగా కంప్లీట్ చేస్తుంటాడు. కానీ తెలివైన కుర్రాడు. అతడు అడిగే డౌట్స్ అంటే లెక్చరర్స్ కి హడల్. తన కొకుడు ఇంకా రిచ్ కావాలనేది తండ్రి కోరిక. అంబానీల ఫ్యామిలీస్ తర్వాత తన కొడుకే ఉండాలనుకుంటాడు. అలాగే తన కోడలు కూడా అలాంటి తెలివితేటలు డబ్బు ఉండాలని కోరుకుంటాడు. అజయ్ కోట్లు విలువ చేసే కార్లలో తిరుగుతుంటాడు. అలాంటి టైం లో అంజలి (టుయా చక్రవర్తి) పరిచయం అవుతుంది. ఆమెను ప్రేమిస్తాడు. అంజలి కి మ్యూజిక్ అంటే ప్రాణం. మ్యూజిక్ కాంపిటీషన్ కోసం ప్రయత్నిస్తుంది. అంజలి వయోలిన్ ప్లేయర్. హీరో హీరోయిన్ మొదట ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాలతో అంజలి బ్రేకప్ చెబుతుంది. ఇంతకు ఎందుకు బ్రేకప్ చెప్పింది అనేది మాత్రం సినిమా థియేటర్ లో చూడాల్సిందే. ఆతర్వాత… అజయ్ అనుపమ (అంకిత మహారాణ) ని కలుస్తాడు. ఇద్దరు కలిసి తిరుగుతారు. ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకుందామనుకుంటారు. కానీ తండ్రి వారి ప్రేమను కాదంటాడు. మరి అజయ్ అంజలిని పెళ్లి చేసుకుంటాడా… లేక అనుపమని ఇష్టపడ్డాడా… తండ్రి ఎవరికి ఓటేశాడన్నది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష…
హీరో ఈశ్వర్ నటనా పరంగా మంచి మార్కులు కొట్టేసాడు. డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్ గా ఉంది. హీరోయిన్స్ తో రొమాన్స్ విషయంలో ఏమాత్రం సిగ్గు పడలేదు. కెమెరా సెన్స్ బాగుంది. రొమాంటిక్ సీన్స్ లో ఈజీగా ఇన్ వాల్వ్ అయ్యాడు. సైన్స్ గురించి… ఇంజినీర్ గురించి హీరో చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ గురించి గొప్పగా చెప్పించాడు దర్శకుడు. హీరోయిన్ అంకిత ఇంట్రడక్షన్ బాగుంది. అంకిత పెర్ ఫార్మెన్స్ బాగుంది. హీరోను తక్కువగా అంచనా వేసే పాత్రలో మెప్పించింది. రింగుల జుట్టుతో అట్రాక్టీవ్ గా ఉంది. లట్టుకు మట్టుకు అనే పాటలో బికినీ అందాలతో రెచ్చిపోయింది. ఈ పాటలో హీరో డ్యాన్స్ ఇరగదీసాడు. భీమ్స్ మంచి బీట్స్ తో ఉన్న పాట ఇచ్చాడు. ఈ పాటలో లిప్ కిస్ కూడా పెట్టించాడు దర్శకుడు. ఈ హాట్ సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. వీరిద్దరి మధ్య పార్క్ లో వచ్చే లిప్ కిస్ సీన్ హాట్ గా ఉంది. టుయా చక్రవర్తి కూడా అభినయంతోనే కాదు బికినీ అందాలతోనూ రక్తి కట్టించింది. హీరోతో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేసింది. ఎమోషన్స్ సీన్స్ ని కూడా బాగా పండించింది.

కామెడీ పరంగా ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ధన్ రాజ్ కామెడీ బాగుంది. అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేశారు. విద్యుల్లేఖ కూడా ఏ జోనర్ జోకులు వేస్తూ రెచ్చిపోయింది. కాలేజ్ జోక్స్ కి బాగా ఎంజాయ్ చేస్తారు. కమెడియన్ మహేష్, నల్ల వేణు కామెడీ బాగుంది. పోసాని, అన్నపూర్ణ కాంబినేషన్ బాగుంది. అత్త అల్లుడు పాత్రలో కామెడీ చేశారు. సుధ బిజినెస్ గురించి ఇంగ్లీష్ లో దంచి కొట్టింది. ఈ సీన్ ఎమోషనల్ గా బాగా పండింది. కెమెరా వర్క్ చాలా బాగుంది. డైలాగ్స్ బాగా రాసుకున్నారు. యూత్ కి కావాల్సిన విధంగా ఫన్నీగా ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి.  నిర్మాతలు సైతం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా క్వాలిటీగా నిర్మించారు. 

దర్శకుడు రఘు రాజ్ యూత్ అండ్ మాస్ ఆడియెన్స్ కి కావాల్సిన విధంగా మంచి విందు భోజనం అందించారు. సినిమాకు తగ్గట్టుగానే ఇద్దరు హీరోయిన్స్ బికినీలతో రచ్చ రచ్చ చేశారు. ప్రేక్షకుల గుండెల్లో సెగలు రేపారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే యూత్ పుల్ రొమాంటిక్ కామెడీ చిత్రం `ఫోర్ లెట‌ర్స్`. ఫ్యూర్ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటుంది. ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ తో పాటు అంత‌ర్లీనంగా “యూత్ అనుకుంటే ఏమైనా చేయగ‌ల‌రు“ అనే మెసేజ్ కూడా ఉంది. క్లైమాక్స్ లో హీరో తండ్రి తో హీరోయిన్ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి.

సో గో అండ్ ఎంజాయ్….

PB Rating : 3.25/5

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial
Secured By miniOrange